కోర్టు కేసులో ఉన్న భూమిని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేయడమే కాక, అందులో ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టారని, అక్రమాలకు తెరదీసిన పల్లైపె చర్యలు తీసుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్‌కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, కె.ఎండీ.జక్రియా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నగర శివారులోని ఆలమూరు గ్రామంలో 200 ఎకరాల భూమికి సంబంధించి పార్టీషన్ సూటు (ఓఎస్ నెంబరు 20/2015) వివాదం అనంతపురం ఒకటవ అడిషనల్ జడ్జి కోర్టులో నడుస్తోందన్నారు. ఈ వివాదం ఎటూ తేలకుండానే 2016లో ఆ భూమిని కొనుగోలు చేసి, ఎలాంటి అనుమతుల్లేకుండా కట్టడాలు నిర్మించారన్నారు. ప్రస్తుతం అక్కడ వ్యవసాయ కళాశాలను నిర్వహిస్తున్నారని వివరించారు. అంతే కాక రైతుల కోసం ప్రభుత్వ భూమిలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఆక్రమించి పూడ్చి వేయిస్తున్నారన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ కట్టడాలను తొలగించాలని, చెక్‌డ్యామ్‌ను పూడ్చివేయించినందుకు పల్లైపె కేసు నమోదు చేయాలని కోరారు.
source : sakshi.com
Discussion about this post