హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది.
Discussion about this post