తమ గ్రామానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎవరైనా సంతోషిస్తారు. రాష్ట్ర ప్రజలు మాత్రం హడలిపోతున్నారు. సీఎం వస్తున్నారని ఉన్న కాస్త సౌకర్యాల్నీ ధ్వంసం చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఈ ఆందోళనను అధికారులూ తమ పనులతో నిజం చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ‘వాలంటీర్లకు వందనం’ బహిరంగ సభ ఏర్పాట్లు. గురువారం నిర్వహించనున్న ఈ సభకు సీఎం జగన్ రానున్నారు. ఇంకేం.. సీఎం వస్తున్నారని అధికారులు ఏకంగా జాతీయ రహదారిపై జేసీబీతో గుంతలు చేసి, రెండు వైపులా బారికేడ్లు పాతారు. హెలిప్యాడ్ ప్రాంతం, సభావేదిక, పార్కింగ్ స్థలాల్లో చెట్ల కొమ్మలు నరికేశారు. వేదిక ఏర్పాటు చేసిన పొలంలో చిప్స్, సిమెంట్ కలిపిన మిశ్రమంతో తాత్కాలిక రహదారి వేశారు. వేదిక సమీపంలో విద్యుత్తు శాఖ అధికారులు 4 తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ఏ గ్రామస్థులు మాత్రం హర్షిస్తారు..!
source : eenadu.net
Discussion about this post