సాంకేతిక జోడించి, బాబుతో నేను సాంకేతికత జోడించి వాట్సప్ గ్రూపుల్లో చేర్చేలా వినూత్న కార్యక్రమాన్ని తెదేపా నాయకులు ముమ్మరం చేశారు. ఇంటింటికీ సూపర్‌సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి, ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల ప్రచారం, బాబుతో నేను.. వంటి కార్యక్రమాల నిర్వహణపై మంగళవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. క్యూఆర్ కోడ్ స్కానర్‌తో కూడిన ప్రచార పత్రాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రతి ఒక్కరి మొబైల్‌తో స్కాన్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని చూడొచ్చన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి ఎంపిక చేసిన వాలంటీర్లు వెళ్లి ఆ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు.
రామగిరి, ఆత్మకూరు, రాప్తాడు మండలాల వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో తెదేపా గూటికి చేరారు. మంగళవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో సునీత నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాలో ఏ మాత్రం ప్రాధాన్యం లేదని అక్కడ ఇమడ లేకనే పార్టీ వీడామని నాయకులు తెలిపారు. పార్టీలోకి చేరిన వారిలో రామగిరి మండలానికి చెందిన కుంటిమద్ది లక్ష్మీనారాయణ, గోపీ, పార్థ, అరవింద్, శేషంపల్లి శివ, నరసింహులు, రాప్తాడు మండలంలోని బోగినేపల్లి నాగేంద్ర, ముత్యాలప్ప, వన్నూరప్ప, అనిల్, కేశవయ్య, ఆత్మకూరు మండలంలోని మాజీ ఎమ్పీటీసీ తిప్పక్క, మాజీ ఉప సర్పంచి తిక్కస్వామి, అనిల్, నారాయణ, ఎర్రిస్వామి, ఆంజనేయులు, నాగేంద్ర తదితరులు ఉన్నారు.
source : eenadu.net
Discussion about this post