తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద ఇంటి స్థలం మంజూరైంది. నీరు, విద్యుత్తు వసతిని అధికారులు కల్పించారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకూ ఇంటి బిల్లులు అందాయి. నేను, నా కుమారుడు కష్టపడి సంపాదించిన సొమ్మును దానికి జత చేసి రూ. 8 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేశా. ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతోంది. ఆ డబ్బుతో సంతోషంగా జీవిస్తున్నా. నేనే కాదు, నా లాంటి ఎందరో మహిళకు సీఎం జగన్ అండగా నిలిచాడని గర్వంగా చెబుతా.
source : sakshi.com
Discussion about this post