తిరుపతి జిల్లా నాయుడుపేటలోని 30 పడకల ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులేస్తున్నారు. చివరికి శవాలను నిల్వ చేసే గదినీ వదలడం లేదు. నాబార్డు నిధులు రూ.5.13 కోట్లతో ఇక్కడి ఆసుపత్రి భవనం పనులు చేస్తున్నారు. భవనం లోపల పనులు పూర్తికాకపోయినా ప్రారంభానికి మాత్రం పాలకులు ఒత్తిడి తెస్తున్నారు. భవనం బయట గోడలకు వైకాపా రంగులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని..త్వరగా ప్రారంభించాలని వైకాపా నాయకులు తహతహలాడుతున్నారు. దీనిపై డీఈ సాంబశివరావును వివరణ కోరగా సుమారు 20 రోజుల్లో పనులు పూర్తవుతాయని, ఆసుపత్రికి వేస్తున్నవి పార్టీ రంగులు కాదని, నిబంధనల మేరకు వేస్తున్నామని పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post