ఎన్నికల వేళ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రతి రోజుఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కనగానపల్లి మండల కేంద్రంలో కోట బీసీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. పరిటాల సునీత వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు ఇతర కులాల వారికి సరైన ప్రధాన్యం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. అక్కడ కేవలం కొంతమందిది మాత్రమే పెత్తనం సాగుతోందన్నారు. టీడీపీతోనే అందరికీ గుర్తింపు ఉంటుందన్న నమ్మకంతో పార్టీలో చేరినట్టు చెప్పారు. మరోవైపు సునీత మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని వలసలు మీరు చూస్తారని అన్నారు. అన్ని చోట్ల వైసీపీ నాయకుల తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు విసిగిపోయారని.. ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గెలిపించినా.. వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా.. వారినే వేధిస్తున్నారని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందని.. అందుకే తెలుగుదేశంపార్టీలోకి వస్తున్నారని సునీత అన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారు ధైర్యంగా రావచ్చని.. ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. తాము ఎప్పటికీ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమలో కన్వీనర్ పోతలయ్య, నెట్టెం వెంకటేష్, ఎంపిటిసి భాస్కర్, సుబ్బయ్య, బాలయ్య, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Discussion about this post