వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. నేడు కి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడ కు చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు. సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ లో చేరనున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టికెట్ ఆశిస్తున్నారు.
source : andhrajyothi.com
Discussion about this post