శింగనమల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వీరాంజనేయులుకు మద్దతుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శింగనమల మండలం రాచేపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నార్పలలో వైకాపా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థికి మద్దతుగా ర్యాలీల్లో, సమావేశాల్లో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన విధులకు డుమ్మా కొట్టి అభ్యర్థి వెంట తిరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగి వైకాపా ప్రచారంలో ఎలా పాల్గొంటారని సీపీఎంతోపాటు ఆయా సంఘాల నాయకులు మండి పడుతున్నారు. దీనిపై ఎంపీడీవో రమణను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శిని ఇది వరకే హెచ్చరించాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెన్నెల శ్రీను ఆదేశాల మేరకు నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post