అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వైకాపా అసమ్మతి నాయకుడు సత్యనారాయణరెడ్డితో డీఎస్పీ శ్రీనివాసమూర్తి సోమవారం భేటీ అయ్యారు. ఆయన స్వస్థలం పుట్లూరు మండలం కడవకల్లు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో డీఎస్పీగా పని చేస్తున్నారు. వైకాపా శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీనివాసమూర్తిని ఎంపిక చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. అనూహ్యంగా వీరాంజనేయులును సమన్వయకర్తగా నియమించారు. ఆయన ఎంపికను నిరసిస్తూ ఇటీవల వైకాపా అసమ్మతి నాయకులు అనంతపురంలో సమావేశమై చర్చించారు. వీరిలో నార్పలకు చెందిన సత్యనారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైకాపా అసమ్మతి నాయకులు మరోసారి అనంతపురంలో సమావేశం కావాలని సిద్ధమవుతున్న తరుణంలో సత్యనారాయణరెడ్డితో డీఎస్పీ శ్రీనివాసమూర్తి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
source : eenadu.net
Discussion about this post