తోపుదుర్తి సోదరుల అరాచకాలకు త్వరలోనే ప్రజలు ముగింపు పలకనున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని కనుముక్కల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భవిష్యత్తు గ్యారెంటీ ప్రచార కార్యక్రమానికి మాజీ మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. అనంతరం సమావేశంలో గ్రామానికి చెందిన సామాజికవేత్త ఉమామహేశ్ ఆధ్వర్యంలో 45 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. వారందరికీ పరిటాల సునీత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తోపుదుర్తి సోదరులు అరాచకాలతో దందాలు సాగిస్తూ దోచుకొని దాచుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. జగన్‌రెడ్డి పాలనకు మూడు నెలల్లో ప్రజలు ముగింపు పలకనున్నారన్నారు. వైకాపా నాయకులు తెదేపాలోకి రావడం అభినందనీయమన్నారు. తెదేపా సానుభూతిపరుల పింఛన్లు తొలగించడం, పథకాలు రాకుండా చేసి వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆక్షేపించారు.
source : eenadu.net
Discussion about this post