ఆయనో సాధారణ టిప్పర్ డ్రైవర్. అయినా, ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడేవారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుర్తించారు. కాసులు ముట్టజెబితే కానీ టికెట్ ఇవ్వననే పార్టీలున్న ఈ కాలంలోనూ ప్రజా సేవే గీటురాయిగా మార్చుకున్న ఆ వ్యక్తికి పట్టం కట్టారు. ఏకంగా తన పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్టు కేటాయించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు వైఎస్సార్ సీపీ శింగనమల అభ్యర్థి వీరాంజనేయులు. ఓ సాధారణ వ్యక్తినైన తనకు పెద్ద బాధ్యతను అప్పగించడంతో వీరాంజనేయులు ప్రజలతో మరింతగా మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పగలంతా ఎన్నికల ప్రచారంలో మునుగుతున్న ఆయన.. రాత్రి కూడా ‘పల్లె నిద్ర’ ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ప్రభుత్వం నుంచి వారికి చేకూరిన లబ్ధిని తెలుసుకుంటున్నారు. శనివారం రోటరీపురం గ్రామంలోని దళితవాడలో సర్పంచ్ నాగభూషణ ఇంట్లో వీరాంజనేయులు నిద్రించారు. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా తమ గ్రామంలోనే బస చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
source : sakshi.com
Discussion about this post