వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైస్సార్‌సీపీ జోనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి పర్యటనకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం మండలాల్లో పర్యటించిన మంత్రి పెద్దరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ ముఖ్యమైన నేతల ఇళ్లకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో చురుగ్గా పని చేయాలని కోరారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వైసీ గోవర్ధన్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన క ార్యదర్శి జీబీ శివకుమార్, రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, అగళి జేసీఎస్ కన్వీనర్ మహేంద్ర, అగళి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, హల్కూరు కాంతరాజు తదితర ఇళ్లకు మంత్రి వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు. ఐదు మండలాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో అనంతపురంలో ఈనెల 10న జరిగే సిద్ధం సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనే ఈ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈర లక్కప్ప ఇంటిని సందర్శించిన మంత్రి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పర్యటనలో భాగంగా గుడిబండ మండలంలోని ఫళారం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈర లక్కప్ప ఇంటిని సందర్శించారు. మంత్రికి ఈర లక్కప్ప కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. సమన్వయకర్తగా నియమించినందుకు ఈర లక్కప్ప కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ, మాజీ మంత్రి నర్సేగౌడ్, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, కుంచిటి వక్కళిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నళిని, పార్టీ మడకశిర నియోజకవర్గ పరిశీలకులు పోకల అశోక్‌కుమార్, ప్రసాద్‌రెడ్డి, పెనుకొండ వైఎస్సార్‌సీపీ నాయకురాలు గంగుల భానుమతి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఉన్నారు.
source : sakshi.com
Discussion about this post