లేపాక్షి మండలంలోని పలు జిల్లా పరిషత్ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరిక్షఅట్టలను గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ డైరెక్టర్ నాగేంద్ర సహకారం తో బిజెపి మండల అధ్యక్షుడు ఎం నరసింహమూర్తి అధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. మండల పరిధిలో చోళ సముద్రం, సిరివరం కంచి సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరిక్షలకు అవసరమైన అట్టలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతిపరీక్షలు రాసే ప్రతి విద్యార్థినీ విద్యార్థులు మంచి ర్యాంకు సాధించాలని భవిష్యత్తు లో విద్యావంతులై దేశ అభివృద్ధికి పాటుపడాలని నేటి విద్యార్థులే రేపటి పౌరులై మంచివిద్యావంతులై ఉన్నత స్థాయిలో ఉద్యోగాలను పొందలని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా చిలమత్తూరు మండలంలో కోడూరు, కొడికొండ,సోమఘట్ట, దేమకేతేపల్లి పాఠశాలలో కూడా అట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాబు ప్రసాద్, గోవింద్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్, రవిశంకర్, బీజేవైఎం ప్రధానకార్యదర్శి అమర్ దేవేంద్ర, మరియు ప్రదానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Discussion about this post