ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన చెన్నేకొత్తపల్లికి చెందిన బీసీ హాస్టల్ వార్డెన్ పాముల నాగరాజు కుటుంబ సభ్యులను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు శుక్రవారం పరామర్శించారు. తాడిమర్రిలో పని చేస్తున్న వార్డెన్ నాగరాజు విధులు ముగించుకుని సొంతూరుకు బైకుపై వస్తుండగా నాగసముద్రం వద్ద అదుపు తప్పి బండి బోల్తాపడింది. ప్రమాద వివరాలను నాగరాజు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Discussion about this post