స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు తెచ్చుకొన్న వడ్డె ఓబన్న అడుగుజాడల్లో మనమందరం ముందుకు సాగుదామని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శుక్రవారం పట్టణంలోని శ్రీకంఠపురంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆవిష్కరించిన వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు వడ్డెర సంఘం నాయకులు రంగప్ప, ప్రసాద్, కొల్లకుంట అంజినప్ప, నవీన్, సునిల్, మంజుల, శ్రీదేవి, శ్రీనివాసులు, రామాంజినేయులు హనుమయ్య, చంద్ర, కృష్ణమూర్తిలు ఘన స్వాగతం పలికి క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించి సుత్తిని, ఓబన్న చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వారి సేవలు నిరంతరం స్మరించుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు.
source : eenadu.net
Discussion about this post