తెలుగుదేశం పార్టీ లో ఎలాంటి గ్రూపులు ,విభేదాలు లేవు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు .
ఐకమత్యమే మహాబలం అందరూ కలిసికట్టుగా పనిచేసి వైసిపిని తరిమి కొట్టాలి. నియోజవర్గ పరిశీలకులు నరసింహారావు గారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రం నందు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బి కే పార్థసారథి గారి ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం జరిగింది .ఈ సందర్భంగా బీకే పార్థసారథి గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పెనుకొండ నియోజకవర్గం మరియు హిందూపురం పార్లమెంట్ MP తో పాటు పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని తెలియజేశారు.పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి గ్రూపులు ,విభేదాలు లేవని అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని తెలియజేసిన సవితమ్మ గారు.వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఉన్నారని వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వచ్చేది టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వమే రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కావున వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పెనుకొండలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేద్దామని అదేవిదంగా పార్లమెంటు అభ్యర్థి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని తెలియజేసిన సవితమ్మ గారు….నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు గారు మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారిని మరియు ఎంపీ అభ్యర్థి బి కే పార్థసారథి గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దామని కావున మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఇద్దరినీ గెలిపించాలని తెలియచేశారు..అనంతరం గోరంట్ల పరిగి ,సోమందేపల్లి రొద్దం,పెనుకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమం గురించి చర్చించిన జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథి గారు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు పరిశీలకులు నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు…..

Discussion about this post