రాయదుర్గం నియోజకవర్గంలో బీటీపీకి కృష్ణా జలాలు మళ్లింపుతో పాటు ఉంతకల్లు రిజర్వాయర్‌ను పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తెదేపా కార్యాలయం వద్ద ఈడిగ సంఘం నాయకులు రంగనాథ్, గురుప్రసాద్, సాయిప్రకాశ్, అరవింద్, గోపి, సురేశ్‌బాబు, రంజిత్‌కుమార్, రాకేశ్ ఆధ్వర్వంలో 500 బీసీ కుటుంబాలు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది సార్లు విద్యుత్తు బిల్లులు పెంచి ప్రజల నడ్డీ విరిచారన్నారు. బడుగు, బలహీన వర్గాల పార్టీ తెదేపా అని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు, రాయదుర్గం అభివృద్ధికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.
source : eenadu.net
Discussion about this post