సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటుకలపల్లి మీదుగా రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు కృష్ణంరెడ్డి పల్లిలో బస చేయనున్నారు.
source : sakshi.com
Discussion about this post