నన్ను, నా తల్లిని ఇన్ని బూతులు తిట్టినా తెలుగుదేశాన్ని.. ఆ నాయకులను క్షమించను అని అగ్గిమీద గుగ్గిలం అయిపోయి ఎగిరెగిరిపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చంద్రబాబు చంకలో దూరిపోయి.. జై జై బాబు అని భజన చేస్తున్నారు. చెస్.. నాకు రాజకీయాలు సరిపడవు.. నాకు అవేం లేదు. ఇక నేను సినిమాలకు మాత్రమే పరిమితం.. నన్ను రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయకండి అని గతంలో చెప్పిన చిరంజీవి సినీ ఇండస్ట్రీ పెద్దగా ఇటు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపారు.
సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ రేట్ల పెంపు వంటి అంశాల్లో చిరు అడిగిందే తడవుగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి తోడ్పాటును అందించారు. నాకు జగన్ ఒక బ్రదర్ అని ఎన్నోసార్లు చెప్పుకుంటూనే.. నాకు రాజకీయాల్లేవు.. అని కూడా అన్నారు. కానీ, బొమిక దొరికినప్పుడు కదా కుక్కబుద్ధిని మనం కనిపెట్టాలి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఈ మెగా బ్రదర్.. దగా బ్రదర్ అవతారంలోకి మారిపోయారు.అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ను, పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు (ఈయన 2009లో అక్కణ్ణుంచి ప్రజారాజ్యం తరఫున కూడా గెలిచారు)ను గెలిపించాలి అంటూ ఒక ప్రకటన చేసారు. సీఎం రమేష్ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండగా పంచకర్ల మాత్రం టీడీపీలో చేరి పెందుర్తి నుంచి బరిలో ఉన్నారు.
తానూ రాజకీయాలకు దూరం అంటూనే సైలెంట్‌గా తన అభిమానులంతా ఎన్డీయేకు ఓటేయాలి అంటూ ఒక ప్రకటన చేసారు. అంటే తన తమ్ముడు ప్యాకేజి తీసుకుని చంద్రబాబు దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతగా ఇటు చిరంజీవి కూడా అన్యాపదేశంగా.. అనివార్యంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. అసలు రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తానూ రాజకీయాలకు సూట్ కానని గతంలో చెప్పేసి.. దండం పెట్టేసి చెప్పులు విడిచిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలి అని ఎందుకు చెప్బుతున్నట్లు.. ఏ ప్రయోజనాల కోసం ఈ ప్రకటన చేసినట్లు.
ఆనాడు తనను, తన ప్రజారాజ్యం పార్టీని తీవ్రంగా అవమానించి పార్టీ మూసేసేవరకు వెంటాడిన టీడీపీ అనుకూల మీడియా మీద అప్పట్లో విరుచుకుపడిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకుని తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు అనేది అర్థం కావడం లేదు. తన తమ్ముడు రాజకీయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన రాజకీయ ప్రయాణంతో తనను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు ఇలా మాట మార్చారని? దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో తనను అవమానించి, పార్టీ మూసేసే వరకు వెంటాడి వేధించిన తెలుగుదేశాన్ని మళ్ళీ మోయడానికి చిరంజీవికి సిగ్గులేదా అని ఆయన అభిమానులే అంటున్నారు. ఇప్పుడు ఆయన మాట విని మళ్ళీ మేము టీడీపీకి ఎందుకు పని చేయాలనీ, మాకేం సంబంధం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ మెగా బ్రదర్స్ అవసరాలకోసం, అవకాశాల కోసం ఏ పార్టీకి ఊడిగం చేస్తే మేము కూడా వాళ్ళ వెనకాల తిరగాలా..వాళ్లకు సిగ్గులేకుంటే మాకూ లేదా అని మెగా ఫ్యాన్స్ లోలోన కుతకుతలాడుతున్నారు. వాస్తవానికి చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఏఐసీసీ సభ్యుడు కూడా.. మరి ఆ పార్టీలో ఉంటూ దానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడిన ఎన్డీయే కూటమికి సపోర్ట్ చేస్తూ ప్రకటన ఇవ్వడం ఏ విలువల కిందికి వస్తుంది. ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ప్రచారం చేయడాన్ని రాజకీయ వ్యభిచారం అనరా?. ఈ విషయం ఈ మెగా దగా స్టార్ తెలీదా?.
-సిమ్మాదిరప్పన్న.
source : sakshi.com
Discussion about this post