వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం సంక్షేమ పథకాలను తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు రూపొందించిన ‘తిరస్కార పత్రం.. జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డు 2019-24’ అనే 8 పేజీల కరపత్రాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. తెదేపా ప్రభుత్వంలో జరిగిన ముస్లింల సంక్షేమం, ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు, అరాచకాల్ని కరపత్రంలో ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాకు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్టు సమితి అధ్యక్షుడు ఫారూఖ్‌షుబ్లీ తెలిపారు.
source : eenadu.net
Discussion about this post