రాజోలు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్
పెందుర్తిలో పంచకర్ల, యలమంచిలిలో సుందరాపు
విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్
భీమవరానికి అంజిబాబు, గూడెం బరిలో బొలిశెట్టి
తిరుపతి టికెట్ ఆరణి శ్రీనివాసులుకే
జనసేన పోటీ చేసే మరో 10 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జిల్లాల వారిగా పోటీ చేసే అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా చర్చించారు. ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు (ఎస్సీ)లో మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు ఖరారైంది. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేశ్‌బాబు, యలమంచిలిలో సుందరాపు విజయ్‌కుమార్ అభ్యర్థిత్వాలను ఆమోదించినట్లు సమాచారం. ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం-పులపర్తి రామాంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్‌లను ఖరారు చేశారు. పిఠాపురంలో పవన్ పోటీ ఖాయమే. తిరుపతి సీటుపై ఆయన బాగా తర్జనభర్జన పడ్డారు. చివరకు ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైపు పవన్ మొగ్గుచూపారు.
source : andhrajyothi
Discussion about this post