తల్లిదండ్రులు పిల్లలకు అందించే శాస్విత ఆస్తి చదువు మాత్రమే అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం 35వ డివిజన్ లోని ఝాన్సీ లక్ష్మీభాయ్ స్కూల్ నందు స్థానిక కార్పొరేటర్ కొండ్రెడ్డి రాధ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మి విద్యకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా పేదరికంతో ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న మంచి ఆలోచనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కోట్లాది రూపాయలు విద్యా రంగానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని అందువల్ల విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గతం కంటే మిన్నగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైయస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు ఆలుమూరు శ్రీనివాస్ రెడ్డి, చింతకుంట మధు, క్లస్టర్ కన్వీనర్ మధుసూదన్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు ఇషాక్, అనిల్ కుమార్, స్థానిక నాయకులు నరసింహులు, లోక్నాథ్ రెడ్డి, విజయభాస్కర, నాగరాజు రెడ్డి, బంకు శీన, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post