నియోజక వర్గంలోని గుత్తి మండలంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక గుత్తి మండలం ధర్మాపురం, బేతాపల్లి గ్రామాలలో పార్టీకి చెందిన ఇద్దరు మృతి చెందారన్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి ఏడో తేదీన ఆయా గ్రామాలలో పర్యటిస్తార న్నారు.
source : andhrajyothi.com
Discussion about this post