నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భాజపా అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శారదానగర్‌లో ఎన్డీఏ ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్, ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. రానున్న 30 రోజులు చాలా కీలకమైనవని, ప్రతి ఒక్కరూ కష్టపడి భాజపాను గెలిపించుకుంటే ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ భాజపా అభ్యర్థి సత్యకుమార్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా వెళ్లి ప్రతి ఒక్కరూ ప్రచారం నిర్వహించాలన్నారు. మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.
source : eenadu.net
Discussion about this post