‘దేశంలోనే హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంటుకు వెళ్లి, ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని దిల్లీలో చెప్పాలని ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోనూ చర్చించా’ అంటూ కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి శనివారం హిందూపురంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సరస్వతీ విద్యామందిరం పూర్వ విద్యార్థుల, అధ్యాపకుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
source : eenadu.net
Discussion about this post