తెదేపా నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబును సీఎంగా చేయడానికి కృషి చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని ఎల్‌బీనగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు ముల్లంగి నారాయణ స్వామి, భాస్కర్ నాయుడు వైకాపా నుంచి తెదేపాలోకి చేరుతున్న నేపథ్యంలో తెదేపా శ్రేణులతో కలసి బళ్లారిలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ ముల్లంగి సోదరులతో పాటు వైకాపా నాయకులు వరుసగా చేరనుండటంతో తెదేపాకు పూర్వ వైభవం వస్తుందన్నారు. వాల్మీకి సంఘం నాయకులు దివాకర్, కృష్ణాపురం ఉప్పర శ్రీనివాసులు, వైకాపా సీనియర్ నాయకులు తెదేపాలో చేరుతున్నారన్నారు.
source : eenadu.net
Discussion about this post