‘సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్’ అంటారు జగన్. సభలు.. సమావేశాల్లోనూ సంక్షేమ జపమే చేస్తుంటారు. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా బీసీలు.. నా మైనార్టీలు.. అంటూ లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఆయా వర్గాలవారిని మాటలతో మురిపించడంలో ఆయన్ను మరిపించేవారే ఉండరేమో..! బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించడమే తన జీవిత పరమార్థం అన్నట్లు ఆయన వల్లెవేసే మాటలు.. మేడిపండు చందమే..!!
బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ప్రగల్భాలు పలికే జగన్ రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 2020-23, 2023-27 పారిశ్రామిక విధానాలే ఇందుకు నిదర్శనం. బీసీ పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు.
source : eenadu.net
Discussion about this post