సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల సంఖ్య పెరిగింది. అనంత లోక్‌సభ స్థానానికి ఒకటి, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్లు వేశారు. ఈ రెండు రోజుల సంఖ్యను కలిపితే… లోక్‌సభకు మూడు, అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ వేసిన వారిలో.. అనంత లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పామిశెట్టి చౌడేశ్వరి నామినేషన్ వేయగా, అసెంబ్లీ స్థానాల వారీగా.. ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా వై.మధుసూదన్‌రెడ్డి, రాప్తాడుకు వైకాపా అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థిగా శంకరయ్య, అఖిల భారత కిసాన్ జనతా పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున, కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు, వైకాపా తరఫున తలారి రంగయ్య, అనంత అర్బన్ స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగనాథ్ గోపీనాథ్, గుంతకల్లు వైకాపా అభ్యర్థిగా వై.వెంకట్రామిరెడ్డి, శింగనమల తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థిగా యాటవెంకట సుబ్బన్న, అఖిల భారత కిసాన్ జనతాపార్టీ తరఫున కప్పల నాగరాజు, రాయదుర్గం బీఎస్పీ అభ్యర్థిగా సి.నాగరాజు, తాడిపత్రి తెదేపా అభ్యర్థిగా జేసీ అస్మిత్‌రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున నల్లా రమేశ్ నాయుడు నామినేషన్లు వేశారు.
source : eenadu.net
Discussion about this post