తెదేపా నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ సభల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం పీలేరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పీలేరు మండలంలోని వేపులబయలుకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4గంటలకు ఉరవకొండ సభలో పాల్గొంటారు.
source : eenadu.net
Discussion about this post