హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయాలని కోరుతూ శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం కొరుగుట్టపల్లి వద్ద.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రికి తమ సమస్యలు విన్నవించారు. ‘హంద్రీనీవా కాలువ తవ్వి ఏళ్లు గడుస్తోంది. చుక్కనీరు ఇవ్వలేదు. దీనికితోడు విద్యుత్తు సరఫరాలో కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి. మేం ఎలా బతకాలి’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ.. ‘కదిరి మండలం పట్నం గ్రామం వద్ద కాలువ గేట్లు ఎత్తాం. త్వరలోనే నీళ్లు వస్తాయి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కుర్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వైకాపా నాయకుడు శివారెడ్డి, తలుపులలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ పలువురు వైకాపా నాయకులు.. కాలువకు నీరు విడుదల చేయాలని మంత్రిని కోరారు.
source : eenadu.net
Discussion about this post