రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమీషన్లకే ప్రాధాన్యం
సాగు, తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు
సీఎం రమేష్‌ను అడ్డుపెట్టుకుని ఖజానాకు కన్నం.. కాంట్రాక్టు విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించినా పూర్తికాని పనులు
పాలార్‌పై రిజర్వాయర్ పనులకూ అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు
కుప్పంను మున్సిపాల్టీగా చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్.. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు
ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ
ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్
కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలించి సాగు, తాగునీరు అందిస్తానని నమ్మబలికిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆ ముసుగులో ఖజానాను దోచేసి పనులు చేయలేక చేతులెత్తేసి నయవంచనకు పాల్పడ్డారు! తన కమీషన్ల కోసం సొంత నియోజకవర్గం కుప్పంను తాకట్టుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు.
బాబు ఇలా మోసం చేస్తే, 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మేలు చేస్తున్నారు. పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇప్పటికే రామకుప్పం మండలం వరకూ కృష్ణా జలాలను తరలించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులు నింపి సమృద్ధిగా సాగు, తాగునీరు అందించనున్నారు.
source : sakshi.com
Discussion about this post