రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి, రామగిరి మండలాల్లో ‘వైఎస్‌ఆర్ చేయూత’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు మాట్లాడుతూ
రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల పింఛన్లు ఇస్తున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలు, కులలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సచివాలయ, వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఇళ్ల వద్దకు తెచ్చాడు. ఇంట్లో కూర్చున్నా సరే వలంటీర్లు వచ్చి పథకాల అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 127 సార్టు బటన్ నొక్కి 2 లక్షల 57 వేల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 127 సార్లు మన కోసం బటన్ నొక్కిన జగనన్న కోసం వచ్చే ఎన్నికల్లో ఎంపీకి సంబంధించి ఫ్యాన్ గుర్తుపై ఒకసారి, ఎమ్మెల్యేకు సంబంధించి ఫ్యాన్ గుర్తుపై రెండోసారి బటన్ నొక్కలేమా?. ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాల అభ్యర్థులు లేచిపోవాలి. జగనన్న పరిపాలన జనరంజకంగా ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను, శాంతమ్మ అక్కను ఆశీర్వదించండి.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..

Discussion about this post