శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్‌ను జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో ధర్మవరంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్మవరంలో వైసీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ప్రశ్నించినవారిని అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టారని అన్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చానని, దానిని నెరవేర్చాలంటే టికెట్‌ను జనసేన పార్టీకి కేటాయించాలని కోరారు.
source : andhrajyothi.com
Discussion about this post