సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో గెలిచిన స్థానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని టీడీపీ తమ్ముళ్లే చెబుతున్నారు. ఎక్కడా విజయావకాశాలు లేవని, చాలా చోట్ల ఈ సారి డిపాజిట్లు కూడా దక్కని దుస్థితి నెలకొందని తమ్ముళ్లు బాధపడిపోతున్నారు.
నాలుగున్నరేళ్ల సీఎం జగన్ జనరంజక పాలనతో జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి హోరును వీస్తోంది. ఈనేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దీంతో కొత్తవారిని బరిలో దింపాలని ఆ పార్టీ అధిష్టానం రహస్య సర్వేలు చేయిస్తోంది. అయితే ఎన్ని సర్వేలు చేసినా గెలుపుపై ఆశలు లేకపోవడంతో పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారిపై టీడీపీ కేడర్‌తో పాటు ప్రజలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా చేస్తున్నారు. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలితం లేదు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధిష్టానం పార్టీలోని ద్విత్రీయ శ్రేణి నాయకుల వైపు దృష్టి సారించింది. అయితే నాలుగేళ్లుగా పట్టించుకోని వారు ఇప్పుడు ‘రా..కదలి రా’ అంటున్న తమ్ముళ్లలో స్పందనలు కరువయ్యాయి. అగ్రనేతలే ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నా… ‘మేమిప్పుడు గుర్తొచ్చామా’ అంటూ ముఖం మీద ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు సైతం అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తమను సంప్రదించకుండా సెకండ్ క్యాడర్‌తో నేరుగా అధిష్టానం టచ్‌లోకి వెళ్లడం ఏమాత్రం సబబు కాదని చెబుతున్నారు.
Source : sakshi.com
Discussion about this post