ఉరవకొండలో శనివారం జరిగిన రా కదలిరా సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో వైకాపాలో వణుకు మొదలయ్యిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఉరవకొండలో వారు మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకుంటున్న జనం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభలకు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. ఉరవకొండ సభకు ఊహించని విధంగా తరలిరావడం అభినందనీయం అన్నారు. ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా నిలువనుందని అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన యువకుల్లో తిరుగుబాటు ప్రారంభం కాగా, అన్ని రకాలుగా నష్టపోయిన రైతుల్లో కోపం పెరిగిందని వివరించారు.
బహిరంగ సభకు అతిథిగా వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు ఆదివారం జిల్లా ముఖ్య ప్రముఖులు, స్థానికులు ఘన వీడ్కోలు పలికారు. ఉరవకొండలోని విడిది ప్రదేశంలో బస్సులో నుంచి బయటికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పలకరించారు. తమ నియోజకవర్గాల అంశాలను ఆయనకు తెలిపారు. అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే హెలిప్యాడ్ వద్దకు వెళ్లి, వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, రాయలసీˆమ పరిశీలకుడు బీద రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, రాయలసీˆమ ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, ఏపీˆ ఐడీసీˆ రాష్ట్ర మాజీ డెరెక్టరు దేవినేని పురుషోత్తం, నాయకులు శ్రీధర్ చౌదరి, ఆలం నరసానాయుడు, వెంటకశివుడు యాదవ్, కేశవరెడ్డి, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post