పులివెందుల ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. స్థానిక రోటరీపురం, క్రిస్టియన్ వీధిలో ఆదివారం ‘బాబుస్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెదేపా కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతి, రాష్ట్రాభివృద్ధిని వైకాపా పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా తెలుగు యువత కడప పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహబూబ్‌బాషా, టీఎన్‌టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లారి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post