ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి.. పోటీ ప్రపంచంలో మేటిగా నిలబడాలి.. కార్పొరేట్ స్కూళ్లను అధిగమించేలా మార్కులు సాధించాలి.. విజ్ఞాన సముపార్జనలో ముందడుగు వేయాలి.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులతో విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్‌లను అందించారు. వాటిలో బైజూస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి వినూత్న కంటెంట్‌ను పిల్లలకు అందుబ్చాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ చిత్తశుద్ధిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post