ఆత్మకూరు మండలం కేంద్రం మరియు కుర్లపల్లి గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు వైఎస్ఆర్సిపిలోకి చేరారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కుర్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బాలకృష్ణ, గంగాధర్, ముత్యాలు, వెంకటేష్, విశ్వనాథ్, నాగప్ప, నారాయణ, హరి.. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన టిడిపి నాయకులు మహెంద్ర, పెద్దన్న, లోకేష్, వేణు, మహేష్, సుజయ్ కుమార్, రమేష్, పవన్, శివ, ఫణి, వేణు, నీలకంఠ, వన్నూరమ్మ, నరసమ్మ, సుబ్బమ్మ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Discussion about this post