రానున్న ఎన్నికలలో శింగనమల నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం శింగనమల మండలంలోని రాచేపల్లి గ్రామం లో బాబూ ష్యూరిటీ.. భవిష్యత గ్యారెంటి కార్యాక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మొదట శ్రీ వెంక టేశ్వరాస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఆమె మాట్లాడారు. చంద్రబాబు అన్ని వర్గాలను ఆదుకునేలా సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో జగన రాక్షస పాలనుకు ఓటుతో చెక్ పెట్టే సమయం అస్నమైందన్నారు. టీడీపీ విజయానికి నియోజకర్గంలో నాయకులు, కార్యకర్తలు 40 రోజుల పాటు సైనికుల్లా పనిచేయాలన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post