వచ్చే ఎ న్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నియోజకవ ర్గ ఇనచార్జి కందికుంట వెం కటప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ ప్రజలను కోరారు. పట్టణంలోని 4వవార్డులో శుక్రవారం ఆమె ఇం టింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజలకు శాశ్వత ప్ర యోజనం చేకూర్చుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు.
Discussion about this post