గత ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ (ఆఖరికి పాలనా సంబంధిత) నిర్వీర్యం చేశాయి. స్వలాభం చూసుకుని కార్పొరేట్ సెక్టార్‌లను విపరీతంగా ప్రమోట్ చేశాయి. ఫలితం.. పేదల బతుకులు మారలేదు. కానీ, 2019 నుంచి స్పష్టమైన మార్పు చూస్తున్నాం. ఆర్థికంగా బలోపేతం అయితేనే అన్నివర్గాలు సమాజంలో గౌరవంగా బతుకుతాయని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశ్వసించారు. సంక్షేమ పథకాలతో ఆసరాగా నిలిచారు. అదే సమయంలో నాలుగు ప్రధాన అంశాల్లో సమాన న్యాయం కల్పించడం ద్వారా సామాజిక సాధికారత సాధించారు. అందుకే మరోసారి విజయ దుందుభికి ‘సిద్ధం’ అవుతున్నారు!
అమ్మ ఒడి.. దేశంలో ఎవరూ ఊహించని పథకం. ఓ పేద తల్లి ద్వారా ఆమె బిడ్డలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం. కానీ, ఈ పథకం ఉద్దేశం వేరు. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చనే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చారనడానికి ఇదొక నిదర్శనం. నాడు నేడు కళ్లెదుటే కనిపిస్తున్న మరో ఉదాహరణ. విద్య రంగం ఒక్కటే కాదు.. వైద్యం, ఆరోగ్యం, అవకాశం(ఉపాధి కల్పన) రంగాల్ని గత ప్రభుత్వం విస్మరిస్తే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయా రంగాల్లో ప్రక్షాళన చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చారు.
‘‘జగన్ పాలన అంబేద్కర్ ఆకాంక్షలకు ప్రతిబింబం. సామాజిక సమతుల్యానికి గీటురాయి. అలాంటి పాలనకు.. దళిత, గిరిజన బహుజన వర్గాల వ్యతిరేకి అయిన చంద్రబాబు మధ్య ఎన్నికల సమరం జరగబోతోంది. పెత్తందారుల పాచికలతో కుట్రలు, మోసాలతో.. డబ్బు వరదలై ప్రవహించినా జగన్ వెంట పేదకులాలన్నీ నిలవబోతున్నాయి’’
source : sakshi.com
Discussion about this post