పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి పట్టణం లోని SBI దగ్గర నుండి ఓం హోటర్ రోడ్, సరస్వతి అపార్ట్మెంట్స్ , బ్రిడ్జ్ సర్కిల్,గంగమ్మ గుడి,చిత్రావతి రోడ్,చిత్రావతి గుట్ట వరకు కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ చారిత్రాత్మక పుట్టపర్తి నియోజకవర్గంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టామని అన్నారు.వేళ కోట్లతో అభివృద్ధి పనులు చేశానని, ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకున్నానని అన్నారు. రాష్ట్రంలో జగనన్న చేసిన అభివృద్ది సంక్షేమాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువ చేసిన జగనన్న నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తూ,పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు.వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని,మరోసారి జగనన్న ప్రభుత్వమే వస్తుందని అన్నారు. ప్రతి గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతిపక్ష పచ్చపార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు అందుబాటులో లేని నాయకులు ఎన్నికల ఉన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ,ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దని అన్నారు.
ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Discussion about this post