రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాను. ఆయన సమక్షంలో తెదేపాలో చేరతా. దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. తెదేపా అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటాం. చంద్రబాబు, లోకేశ్‌ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక తెదేపాలో చేరుతున్నా. వైకాపాలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
source : eenadu.net
Discussion about this post