బీసీలకు పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఐక్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి కాలవ సన్నన్న ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. వందలమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలో బీసీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 1,260 సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆర్థికంగా బీసీలను ఆదుకున్నామని, ప్రస్తుతం 56 బీసీ కార్పొరేషన్లు పెడితే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బీసీలను ద్రోహం చేసిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు.
source : eenadu.net
Discussion about this post