రాప్తాడులో ఈ నెల 28న జరగనున్న తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. రాప్తాడు సమీపంలో నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను ధర్మవరం పార్టీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కాకినాడ రాజశేఖర్‌లతో కలిసి ఆమె సోమవారం పరిశీలించి, హాజరయ్యే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశాలపై చర్చించారు. సునీత మాట్లాడుతూ.. రాప్తాడులో తెదేపా ఏంటన్నది ఈ సభ ద్వారా తెలియజేద్దామన్నారు. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు బహిరంగ సభ ఉంటుందని నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి నాయకులు కార్యకర్తలు తరలిరావాలన్నారు. మండల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు, తెదేపా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post