తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగంలో తొలిరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సుమారు 50 మంది రుత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
source : eenadu.net
Discussion about this post