అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టిడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత. రాప్తాడులో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ,జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ దగ్గర కూర్చొని ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వైసీపీ ‘సిద్ధం’ సభలకు జనం స్వచ్చదంగా రాలేదని అన్నారు.బెదిరించి ప్రజలను సభలకు తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు. కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ రాప్తాడుకు వచ్చారని విమర్శించారు. అభివృద్ధికే సున్నం పెట్టిన జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు
source : andhraprabha.com
Discussion about this post