‘మేమంతా సిద్ధం’ పేరుతో 27 నుంచి బస్సు యాత్ర
వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్
అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవ ర్గాలో మార్పుచేర్పులు చేసినందున.. వాటిలో కొత్త అభ్యర్ధులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వ యభర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వర్గపోరు లేకుండా ఎక్కడిక క్కడ సర్దుబాటు చేయాలన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశము య్యారు. పోలింగు చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థి వారి పరిధిలో అన్ని సచివాలయా లను సందర్శించేలా చూడాలని సూచించారు. ప్రాంతీయ సమన్వ యకర్తలు వారికి అప్పగించిన ప్రాంతాల్లోనే ఉంటూ ఎన్నికల వ్యవహారాలు, ప్రచార సరళిని చూసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి తాను బస్సు యాత్ర చేప డుతున్నానని జగన్ చెప్పారు. గతంలో నిర్వహించిన సిద్ధం సభల్లాగే తన బస్సు యాత్రనూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నా మన్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ చేపట్టబోయే ఈ యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలుస్తానని, బహిరంగ సభలూ
ఉంటాయని వివరించారు. ఈ సభలకు జనసమీ కరణ, వారందరికీ రవాణా సదుపాయం కల్పిం చడం వంటివన్నీ ప్రాంతీయ సమన్వయకర్తలే పర్యవేక్షించాలన్నారు.
21 రోజుల పాటు 21 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో సీఎం. జగన్ ఇక జనం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతు న్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో 21 రోజులు పాటు 21 లోకసభ నియోజకవ ర్గాల పరిధిలో ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. కార్యక్రమం… పరిధిలోని ఇడుపులపాయ నుంచి మొదలు కానుంది. సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలను మినహాయించి మిగ్ లిన లోకసభ నియోజకవర్గాల్లో ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం విడుదల చేయను న్నట్లు సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సోమవారం వైకాపా కార్యాలయంలో ప్రకటించారు.
Discussion about this post