రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయించే బాధ్యత వాలంటీర్లు తీసుకోవాలని, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సంతబొమ్మాళి వాలంటీర్లకు మూలపేట పోర్టులో ఉద్యోగాలు ఇస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో గ్రామాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు వైకాపా విజయానికి కృషి చేయాలని, సంతబొమ్మాళి మండలంలో పనిచేస్తున్న 440 మంది వాలంటీర్లకు పోర్టులో ఉద్యోగాలు వేస్తామని హామీ ఇచ్చారు. ఖాళీ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post